MP Bandi Sanjay Kumar | తిమ్మాపూర్, జూన్21: ప్రస్తుతం ఎన్నికలు ఏమీ లేవని అభివృద్ధి పైనే తమ దృష్టి ఉన్నదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో రూ.75లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అడిగిన ప్రతీ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నానన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పైన దృష్టి పెడుతున్నామన్నారు.
ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. అభివృద్ధిలో అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానన్నారు. గన్నేరువరం ప్రజలు కరీంనగర్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, ఎల్ఎండీ రిజర్వాయర్ మానేరు వాగు పైన గన్నేరువరం మండలానికి బ్రిడ్జి నిర్మాణానికి రూ.100 కోట్లతో నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మంత్రి, ఎమ్మెల్యేను గ్రామస్తులు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
అలాగే గ్రామంలోని శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమం లో రవ్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు జగదీశ్వర చారి, నుస్తలాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రణీత్ రెడ్డి, వేల్పుల ఓదయ్య, దావు సంపత్ రెడ్డి, అలువాల కుమార్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.