Coal production | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 లో శుక్రవారం రెండు నూతన షావేల్స్ ను అర్జీ- 1 జీఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్జీ-1 జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ 3 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల రెండు షావేల్స్ ను సుమారు రూ.3.6 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు.
రెండు షావేల్స్ కు మంజీరా, మానేరు లుగా నామకరణం చేశామని తెలిపారు. ఈ షావేల్స్ ను ప్రారంభించుకోవటం చాల సంతోషకరంగా ఉందన్నారు. రానున్న రోజులలో ఇట్టి షావేల్స్ ద్వారా మరింత బొగ్గు ఉత్పతి చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. గతంలో పాత షావేల్స్ తో ఇబ్బందులు ఉన్నప్పటికీ నూరు శాతం ఉత్పత్తి సాధించినందుకు ఉద్యోగులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో కలిసి కట్టుగా రక్షణతో మనకు నిర్థేశించిన బొగ్గు ఉత్పతి లక్ష్యాలను సాధించాలని జీఎం సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, పీవో చంద్ర శేఖర్, బ్రాంచి సెక్రటరీ అరెల్లి పోశం, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వర్ రావు, ఎఎస్ఓ సాయి ప్రసాద్, మేనేజర్ పోనోగోటి శ్రీనివాస్, రమేష్ బాబు, పెరుమాల శ్రీనివాస్, ఎస్.సి సివిల్ వర ప్రసాద్, ఫిట్ సెక్రటరి గుర్రం ప్రభుదాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.