farmer insurance | హుజురాబాద్ ఆగస్టు 10 : నూతన పట్టాదారులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని హుజురాబాద్ ఏడీఏ సునీత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు బీమా పథకం-2025 సంవత్సరానికి గాను కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన అర్హత కలిగిన రైతుల వివరాలు వ్యవసాయ శాఖ అధికారుల లాగిన్ లో వచ్చి ఉన్నవని తెలిపారు.
కావున రైతులు ఈ నెల 11 నుండి 13 లోపు తమ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ల వద్ద సదరు ధ్రువ పత్రాలను అందించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు సోదరులు సమయం తక్కువగా ఉన్నందున గడువు ముగియక ముందే రైతు బీమా కి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అదే విధంగా అంతకు ముందు బీమా కలిగి ఉండి మార్పులు ఏమైనా ఉన్న లేక అంతకు ముందు దరఖాస్తు చేసుకోలేకపోయినా కూడా అధికారులను పూర్తి వివరాలతో సంప్రదించాలని చెప్పారు.
దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు