Mallapur | మల్లాపూర్, ఆగష్టు 10 : మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో గ్రామాభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా క్యాతం సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా గండికోట గంగనర్సయ్యతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నికైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు సంగ గంగరాజం, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వీడీసీ కమిటీ సభ్యులు, అఖిలపక్షం పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.