విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారుతున్నది. కొడిమ్యాల మండలం గంగారాంతండాలో మంగ్యానాయక్ చెట్టు వద్ద కాట్రేవులు వెళ్లేదారిలో కొన్నేండ్ల క్రితం వర్షాలకు 33 కేవీ ట్రాన్స్ఫార్మర్ కిందికి వంగిపోగా, మరమ్మతులు చేయాల్సిన ట్రాన్స్కో యంత్రాంగం కర్ర సపోర్టు పెట్టింది. కర్ర విరిగినా, జారినా ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయే ముప్పు ఉండగా, ఇప్పటికైనా మేలుకోవాల్సి ఉన్నది.
– కొడిమ్యాల, జూన్ 12