Nawabpet | నవాబ్పేటలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నకు రూ.లక్ష నష్టం
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామానికి చెందిన బోల్లి లింగయ్య లచ్చవ్వకు చెందిన ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా బూడిద పాలు అయిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు.
- బూడిదైన మొక్కజొన్న పంట పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
Nawabpet | చిగురుమామిడి, ఏప్రిల్ 16 : చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామానికి చెందిన బోల్లి లింగయ్య లచ్చవ్వకు చెందిన ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా బూడిద పాలు అయిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. నవాబుపేట గ్రామంలో విద్యుత్ సర్క్యూట్ తో బూడిదైన మొక్కజొన్న పంటను బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే చివరి దశలో అధికారుల నిర్లక్ష్యంతో బూడిద కావడం బాధాకరమన్నారు.
రూ.లక్ష విలువగల మొక్కజొన్న పంట బూడిదైందని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి వేణు, మాజీ అధ్యక్షుడు శరభంద రెడ్డి, నాయకులు సత్యనారాయణ, మక్బూల్ ఫాషా, దామ శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సంపత్, సతీష్, ఆగయ్య తదితరులు ఉన్నారు. కాగా గ్రామానికి చెందిన బాధిత రైతు కుటుంబానికి జరిగిన నష్టం గూర్చి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అధికారులతో మాట్లాడి బాధితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని సర్పంచ్ గూళ్ల రజిత రాజు ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

