Annadanam | సుల్తానాబాద్ రూరల్, ఆగస్టు 29: గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల్లో భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని చేశారు.
అందులో భాగంగా మండలంలోని గర్రెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద గరేపల్లి మాజీ సర్పంచ్ విరగోని సుజాత రమేష్ గౌడ్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు భక్తులు తదితరులున్నారు. సుల్తానాబాద్ పట్టణంలో ఆల్ ఫోర్స్ స్కూల్ కి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మాజీ ఎంపీటీసీ దికొండ భూమేష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.