National Press Day | పెద్దపల్లి రూరల్, నవంబర్ 16 : జాతీయ పత్రికా దినోత్సవం నవంబర్ 16 ను పురస్కరించుకుని పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ లో ఆదివారం బీఆర్ఎస్ నాయకుడు, సామాజిక సేవా కార్యకర్త మిట్టపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువజన నాయకులు పెద్ద ఎత్తున పాత్రికేయులను శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తూ, సమాజంలో మార్గదర్శకులుగా నిలుస్తు నిజాలను నిర్భయంగా రాస్తూ ఫోర్త్ ఎస్టేట్ గా ప్రజా గళాన్ని తమ కళంతో వినిపిస్తున్న వివిద పత్రికలు మీడియాలలో పని చేస్తున్న పాత్రికేయ మిత్రుల పాత్ర చాల గొప్పదన్నారు.
సమాజంలో సోషల్ మీడియా విస్తృతంగా నడుస్తున్న తరుణంలోనూ పత్రిక ద్వారానే ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న పాత్రికేయులందరి సేవలను ప్రతీ ఒక్కరూ పార్టీలకతీతంగా గుర్తించి వారి మనుగడను కాపాడుతూ రాత్రింబవళ్లు సమాజ హితం కోసం పనిచేస్తున్న పాత్రికేయుల కుటుంబాలను ప్రభుత్వాలు పాలకులు ఆదుకుని అండగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నవంబర్ 16 జాతీయ పాత్రికేయ దినోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యకర్తలుగా తమ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి శ్రీనివాస్, కలవేన రవి, ఎలబోతారం మహేష్, ఎనగందుల శ్రీనివాస్, మిట్టపల్లి సదానందం, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.