National Integration Day | గంగాధర, సెప్టెంబర్ 17: జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలను మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే బీజేపీ ఆధ్వర్యంలో మధురానగర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మండల కేంద్రంలో సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, వెలిచాల తిరుమలరావు, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము, ఎస్సై ఆరోగ్యం, ఎంఈఓ ప్రభాకర్ రావు, సబ్ రిజిస్టార్ సదాశివరామకృష్ణ, సీడీపీవో వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండలంలోని 33 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.