ముంపు భూములకు పరిహారం ఇవ్వండి
నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న భూములకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కరీంనగర్ కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న 186.5ఎకరాల పట్టా భూమికి మాత్రమే పరిహారం అందించారని, మరో 180.06ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు ఇప్పటివరకు చెల్లింపులు చేయలేదని వాపోయారు.
- నారాయణపూర్ గ్రామస్తులు
- కరీంనగర్‌కు కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో రాక
- న్యాయం చేయాలని వేడుకోలు
కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 23: నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న భూములకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కరీంనగర్ కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న 186.5ఎకరాల పట్టా భూమికి మాత్రమే పరిహారం అందించారని, మరో 180.06ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు ఇప్పటివరకు చెల్లింపులు చేయలేదని వాపోయారు.
అటు పరిహారం అందక, ఇటు పంటలు సాగు చేసుకునేందుకు భూమి లేకపోవడంతో తమకు ఉపాధి కరువైందని ఆవేదన చెందారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు హామీ ఇస్తే నమ్మి ఎమ్మెల్యేను గెలిపిస్తే.. రెండున్నరేళ్లు దాటినా కూడా తమకు అన్యాయమే ఎదురవుతుందన్నారు. చెరువులో భూములు పోవడంతో ఉపాధి కోల్పోవడంతో ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. పిల్లల చదువులకు ఫీజులు చెల్లించలేక, కుటుంబాల పోషణ కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి నష్ట పరిహారం అందించాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

