Namaste Day | కోరుట్ల, జూలై 16: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమస్తే డే కార్యక్రమాన్ని అధికారులు బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ కార్డుల కోసం కేవైసీ జరిపించారు. పారిశుధ్య కార్మికులకు పీపీఈ రక్షణ కిట్లను మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు.
పారిశుధ్య, సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో పీపీఈ కిట్లను తప్పనిసరిగా దరించాలని కమిషనర్ సూచించారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, అశోక్, పర్యావరణ ఇంజనీరు మహేష్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.