Godavarikhani | కోల్ సిటీ, జూన్ 23: నిరుపేద ముస్లిం యువతి వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి చేయూత అందించారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్‌కు చెందిన సయ్యద్ ఖాసీం అనే లారీ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యాడు. అతడి కూతురు షిఫానా అంజుమ్ కు వివాహం నిశ్చయమైంది. పెళ్లి ఖర్చులకు ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబ పరిస్థితి తెలుసుకొని వ్యాళ్ల హరీష్ రెడ్డి తక్షణ సాయం అందించాలని టీం సభ్యులకు సూచించారు.
దీంతో సోమవారం వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ మాజీ కో-ఆప్షన్ తస్నీమ్ భాను, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి చేతుల మీదుగా యువతి కుటుంబంకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. నియోజక వర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆపదలో సమయంలో కొండంత అండగా నిలుస్తున్న హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మునుకుంట్ల కృష్ణస్వామి, పొలాడి శ్రీనివాస రావు, డాక్టర్ కరుణాకర్, బొట్ల పోచం, నడిపెల్లి సాయి, గోపి, సయ్యద్ అక్చర్, నూతి రాజ్ కుమార్, సజ్జు, ఆరిఫ్, యాకూబ్, కరీం తదితరులు పాల్గొన్నారు.