Peddapally | పెద్దపల్లిరూరల్, సెప్టెంబర్ 8 : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మున్సిపల్ కార్మిక సంఘ అధ్యక్షుడు ఆరెపల్లి చంద్రయ్య ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి ఆయన స్వగ్రామమైన పెద్దపల్లి మండలం హన్మంతునిపేటకు వెళ్లి మున్సిపల్ కార్మికుడిగా అందించిన సేవలను గుర్తుచేస్తూ చంద్యయ్య మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
చంద్రయ్య కుటుంబ సభ్యులను మమతారెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ధైర్యం చెప్పారు. ఆమె వెంట మాజీ సర్పంచ్ తీగల సదయ్య, పెద్దపల్లి సింగిల్ విండో డైరెక్టర్ మేకల కుమార్ యాదవ్, నాయకులు భయ్యప్ప కొమరయ్య యాదవ్, సలిగంటి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.