ponds| రామగిరి జూన్ 15: చెరువులు, కుంటల్లో మట్టి ని తోడేస్తున్న మాఫియా గ్యాంగ్ లు ప్రభుత్వ సెలవు రోజులైన శనివారం, ఆదివారం ఈ రెండు రోజులుగాపదుల సంఖ్యలో లారీలతో మట్టిని మండలం లోని కల్వచర్ల గ్రామం వద్ద డంప్ చేస్తున్నారు. మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి గుండా లారీల్లో రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవరించడం జరుగుతుందని ఈ ప్రాంత వాసులు నుంచి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఒక వేల అధికారులు చెరువు ల్లో మట్టికి అనుమతి ఇస్తే వారి పర్యవేక్షణ లో నిర్ణయిత కొలతల ప్రకారం మాత్రమే తీసుకోవాలి.
సెలవు రోజుల్లో మట్టి తరిలింపుకు ఎవరు అనుమతి ఇచ్చారానేది ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సెలవు రోజుల్లో అధికార్లు ఉండరనే నెపం తో రామగిరి మండలకు చెందిన కొందరు ఇటుక బట్టి నిర్వాహకులు ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే జిల్లా కలెక్టర్ మట్టి అక్రమ రవాణా పై దృష్టి సారించి అక్ర మార్కులపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.