ముస్తాబాద్, జనవరి 11: గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎంపీపీ జనగామ శరత్‌రావు పేర్కొన్నారు. బుధవారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బెడ్లు, బ్యాగులు, ప్యా డ్లు, బెల్టులను ఆర్బీఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావుతో కలిసి అందించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నదని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తూ, ప్రైవేట్‌కు దీటుగా అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుత్నుదని చెప్పారు. ఇక్కడ ప్రిన్సిపాల్ ఉదయ్‌కుమార్, సర్పంచ్ సుమతి, జడ్పీటీసీ నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏనుగు విజయరామారావు, ఎస్ఎంసీ సభ్యులు, టీచర్లు ఉన్నారు.