ముస్తాబాద్, ఫిబ్రవరి 19: యాసంగి పంటలకు ఢోకాలేదని, రెండుమూడు రోజుల్లో మండలానికి కాళేశ్వరం జలాలు చేరుకోనున్నాయని ఎంపీపీ జనగామ శరత్‌రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబిడ్డ కేసీఆర్ ప్రత్యేక చొరవతో బీడు భూములు సస్యశ్యామలం అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎండలు ముదురడం.. భూగర్భజలాలు తగ్గుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ చొరవతో మల్ల న్న సాగర్ జలాలు మండలానికి చేరనున్నట్లు తెలిపారు. దేశ ప్రజ లు కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్‌రావు, నర్సింహాడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజరామారావు, సాదుల్పాషా, శ్రీనివాస్‌రెడ్డి, శీలం స్వామి, మెంగని మనోహర్, రంజిత్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.