చిగురుమామిడి, ఫిబ్రవరి 18 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడిగ మండలంలో రాబోయే వేసవిలో నీటి ఎద్దడి నివారణకు గాను ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. కొండాపూర్ గ్రామంలో ముందస్తు నీటి ఎద్దడి నివారణకు కాశవాడ, గంగిరెద్దుల కాలనీ, చీకట్ల వాడ, బీసీ కాలనీలను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జ్ఞానేశ్వరి తో కలిసి పరిశీలించారు. వాటర్ ట్యాంక్లు గేట్ వాల్స్, పైపు లైన్లను పరిశీలించారు.
మిషన్ భగీరథ ద్వారా వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడితే నూతనంగా పైప్ లైన్ వేసి బావులు, బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మండలంలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నామని ఎంపీడీవో తెలిపారు. వీరి వెంట వీరి వెంట సర్పంచ్ మార్క రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అమృత వర్షిని, సిబ్బంది పాల్గొన్నారు.