Election Material | ధర్మపురి, డిసెంబర్08: మూడో విడతలో నిర్వహించే గ్రామ పంచాయితీ ఎన్నకల నేపథ్యంలో పోలింగ్ కు అవసరమయ్యే ఎన్నికల సామగ్రిని సిబ్బందికి సిద్ధంగా ఉంచినట్లు ఎంపీడీఓ నరేశ్ తెలిపారు. మండలంలోని 25ఆర్వో, 224 పీఓలకు సంబందించి ఎన్నికల సిబ్బంది కోసం ధర్మపురి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని సిద్ధంగా ఉంచారు.
పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయాల్సిన బ్యాలెట్ బాక్సులు, సీల్ కవర్లు, ఇండెలిబుల్ ఇంక్, ఫారాలు, స్టేషనరీ వస్తువులు తదితర వస్తువులతో ఎన్నికల సిబ్బందికి అప్పగించాల్సిన కిట్లను విభజించి నియమితులైన అధికారులకు అప్పగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పోలింగ్ రోజున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు లాజిస్టిక్స్ పాటు సెక్యూరిటి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. ఇక్కడ సూపరింటెండెంట్ రాణి, జూనియర్ అసిస్టెంట్ మహేశ్, సిబ్బంది ఉన్నారు.