Dharmaram | ధర్మారం, నవంబర్ 23′ ధర్మారం మండలం బుచ్చయపల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య సిలిండర్ గ్యాస్ లీక్ అయి పూరి గుడిసె దగ్ధం గాక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. నిరుపేద ఊర్లో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. సదయ్య భార్య మాధవి శనివారం ఉదయం 11 గంటలకు ఇంట్లో వంట చేస్తుండగా అకస్మాత్తుగా సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి.
వెంటనే మాధవి తన కుమారున్ని ఎత్తుకుని ఇంటి బయటకు వచ్చి కేకలు వేయగా చుట్టుప్రక్కల వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదంలో గుడిసె దగ్దం కాగా వారి దీన పరిస్థితిని అర్థం చేసుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ సదయ్య కుటుంబానికి రూ. 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఆదివారం ధర్మారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ బుచ్చయ్యపల్లి లోని బాధితుల ఇంటికి వె కుటుంబానికి డబ్బులు అందించారు.
ఈ సందర్భంగా సదయ్య కుటుంబ సభ్యులు ఎంపి గడ్డం వంశీకృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నవేని స్వామి, బొంగాని సత్యనారాయణ, నార లక్ష్మణ్, మేడే మహేందర్, కాల్వ పవన్, దుంపేటి సదానందం, గంప శ్రీధర్, పూసల సదానందం, ఆవుల రాజయ్య, పొడేటి అంజయ్య, కంచు హనుమంతు, వేల్పుల స్వామి, బండారీ నర్సింగం పాల్గొన్నారు.