MP Gaddam Vamsi Krishna | ధర్మారం, నవంబర్ 11 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మాజీ వైస్ ఎంపీపీ నార ప్రభాకర్ కుటుంబాన్ని శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా ధర్మారానికి ఆయన వచ్చారు. మృతుడు ప్రభాకర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి సానుభూతి వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంపీ వంశీకృష్ణ వెంట ధర్మారం మాజీ ఎంపీపీ నార బ్రహ్మయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వామి తదితరులు ఉన్నారు.