Food poisoning | రుద్రంగి, ఏప్రిల్ 7 : రుద్రంగి మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ తో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35) ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిన్నారు.
రాత్రి సమయంలో వారిద్దరికీ వాంతులు, విరేచనాలు కావడంతో వారిని కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయత్రం పుష్పలత మృతి చెందింది. నిహాల్ కు మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం ఉదయం మృతి చెందాడు.
తల్లి, కుమారుడి మృతి వార్తతో రుద్రంగిలో విషాదం నెలకొంది. పుష్పలత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు.