Oil balls | జగిత్యాల, జూన్ 19 : వర్షాకాలం దృష్ట్యా మురికి గుంతల్లో, నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా మున్సిపల్ పక్షాన దోమల నివారణకు చర్యలు చేపట్టామని జగిత్యాల మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ జంగిలి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం మున్సిపల్ పరిధిలోని 4,8,10,13,30 వార్డుల్లో డ్రైనేజిలు శుభ్రం చేసి, చెత్త, చేదారం తొలగించడమే కాకుండా ఇళ్లల్లో నీటి నిలువలు ఉండకుండదని ప్రజలకు సూచించారు.
నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా మున్సిపల్ సిబ్బంది ఆయిల్ బాల్స్ వేసి మందు పిచికారీ చేశారనీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.