Prajavani | వేములవాడ, డిసెంబర్ 29: వేములవాడ పురపాలక సంఘం పరిధిలో దోమలు ప్రజలను రోగాల పాలు చేస్తున్నాయని వేములవాడ పట్టణానికి చెందిన రేగుల రాజ్ కుమార్ సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పట్టణంలోని అన్ని వార్డులలో ఫాగింగ్ చేపట్టి దోమలను నివారించి ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని ఆయన కోరారు.