Farmers | ధర్మారం, అక్టోబర్ 24 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పత్తి పంట ను మద్దతు ధర కు విక్రయించుకోవడానికి రైతుల సౌకర్యార్థం ‘కపాస్ కిసాన్’ అనే మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఓటీపీ ద్వారా చేసుకోవాలని మండల ఇన్చార్జీ వ్యవసాయ అధికారి బీ భాస్కర్ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతులు ఆధార్ అనుసంధాన మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీతో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఆయన వివరించారు. మొబైల్ నెంబర్ మార్చుకోవాలని రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని ఇన్ చార్జి ఏవో భాస్కర్ కోరారు.