కోరుట్ల, డిసెంబర్ 25: కోరుట్ల పట్టణంలోని కావేరి గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ వై అనూప్‌రావు – స్వీతి అనూప్‌ల మనుమడు, నిశ్చల్ – రీతురావు తనయుడు ఇయాన్ మొదటి పుట్టిన రోజు వేడుకలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇయాన్‌ను ఆశీర్వదించిన కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి భోజనం చేశారు.
కవిత వెంట కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దంపతులు, డాక్టర్ సంజయ్‌కుమార్ దంపతులు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఉన్నారు. అలాగే పుట్టిన రోజు వేడుకలకు ఎమ్మెల్సీలు రమణ, జీవన్‌రెడ్డితో పాటు బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.