కారేపల్లి, అక్టోబర్ 05 : వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని కారేపల్లి (సింగరేణి) మండల పరిధిలోని బాజుమల్లాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. స్థానిక ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్ఓ) ఆర్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల ప్రాధాన్యత, వాటి సంరక్షణ, అడవుల పరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతాయుతమైన వైఖరిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ అధికారులు జి.వీరన్న, మల్లయ్య, శ్రీకాంత్, గోగ్గేలా రమాదేవి పాల్గొన్నారు.