హైదరాబాద్ : రాష్ట్రంలో మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో ( DMHO )గా పనిచేస్తున్న స్వర్ణకుమారి ( Swarna Kumari ) సోమవారం లక్ష రూపాయల లంచం ( Bribe ) తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుల నుంచి లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు.