జగిత్యాల, ఫిబ్రవరి 7: జగిత్యాల మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగరేసి.. తొలి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకువస్తామన్నారు. ఈ మేరకు శనివారం జగిత్యాల మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌తో కలిసి వార్డుల్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించి, రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని కొనియాడారు. అభివృద్ధి అంటూ కాంగ్రెస్‌లో చేరిన స్థానిక ఎమ్మెల్యేకు దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సంయమనం పాటించాలని సూచించారు. దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో వంద శాతం సబ్సిడీలు, షాదీముబారక్, రంజాన్ తోఫా, కమ్యూనిటీహాల్ లాంటి అనేక సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్‌కు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి బహుమతి అందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల మానస, వొల్లెం లక్ష్మి, తాడెపు మానస, కస్తూరి ఆదిశేషులు, ఎండీ జావీద్ఫహద్ ఆశ్ర రిజ్వాన్, ఎండీ అబ్దుల్ ఆరీఫ్, అసీం పవన్, అవారి పవిత్రశివకేసరిబాబు, గొల్లపల్లివర్ష శ్రీకాంత్, గాజుల శ్రీనివాస్, సావన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు అయిల్నేని వెంకటేశ్వర్రావు, దావ సురేశ్, శీలం ప్రవీణ్, ఆనందరావు, వొల్లెం మల్లేశం పాల్గొన్నారు.