హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరుగాలని, శాస్త్రవేత లు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రా ల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతు ల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విసృ్తతంగా వినియోగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్ కు మంత్రి శంకుస్థాన చేశారు. కార్యక్రమం లో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సురేంద్రమోహన్, ఉద్యానవర్సిటీ వీసీ డీ రాజిరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ డైరెక్టర్ పవన్‌కుమార్, డీన్ చీనానాయక్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.