స్కిల్ వర్సిటీలో విలీనం మాకొద్దు.. పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనల హోరు
స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే ఉన్నత చదువులు దూరమవుతాయి, ఉద్యోగాలూ దక్కవని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- సేవ్ పాలిటెక్నిక్ పేరిట పోరాటం
- ఎక్కడికక్కడ రాస్తారోకో, ధర్నాలు
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే ఉన్నత చదువులు దూరమవుతాయి, ఉద్యోగాలూ దక్కవని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మూడో రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగాయి. విద్యార్థులు, అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. సేల్ పాలిటెక్నిక్ అంటూ నినాదాలు మిన్నంటాయి. అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఫ్‌ఐ, ఏఐడీఎస్వో వంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. కొత్తగూడెంలో జేఏసీ నేతలు సీపీఐఎల్పీ లీడర్ కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఎవరిని అడిగి విలీనం చేశారు?
ఎవరిని అడిగి పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేశారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండా విలీనం చేయడమేంటని నిలదీస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగాలే దక్కవని, సాంకేతిక విద్యామండలి స్వతంత్రత దెబ్బతింటుందని, డిప్లొమా కోర్సులను సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసెట్ ద్వారా ల్యాట్రల్ ఎంట్రీకి అవకాశమే ఉండదని, ఉన్నత చదువులు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. తక్షణమే జీవో97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సాంకేతిక విద్యామండలి స్వతంత్రత దెబ్బ తింటుందని, డిమాండ్ ఉన్న డిప్లొమా కోర్సులను సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు.
ఊరూరా నిరసనలు
- గద్వాల కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో వర్షంలోనూ భారీ ధర్నా నిర్వహించారు. బస్టాండ్ వద్ద కూడా ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్‌లో విద్యార్థుల ఆందోళనతో బస్టాండ్ హోరెత్తింది.
- మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థుల ఆందోళన ఉద్రికత్తకు దారితీసింది. సిద్దిపేట జిల్లాల్లో విద్యార్థులు ఆందోళనకు పూనుకున్నారు.
- కోరుట్లలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులు మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చేపట్టారు.
- హైదరాబాద్‌లోని కులీకుతుబ్‌షా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బహదూర్‌పురలో ఆందోళనకు దిగారు. మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
- నిర్మల్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. బడంగ్‌పేట పాలిటెక్నిక్ అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు.
- సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
- మణుగూరు పాలిటెక్నిక్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన చేపట్టారు.
- నల్లగొండలో పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ర్యాలీతో వెళ్లి రాస్తారోకోను నిర్వహించి నిరసన తెలిపారు.
ఇష్టంలేకపోతే తొలగిస్తం: మంత్రి వివేక్
పాలిటెక్నిక్ కాలేజీల విలీనం ఇష్టం లేకపోతే తొలగిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీనిచ్చినట్టు పాలిటెక్నిక్ జేఏసీ నేతలు తెలిపారు. కొత్తగూడెం జిల్లా మణుగూరు ఐటీఐ కాలేజీలో మంత్రిని కలిసిన జేఏసీ నేతలు పాలిటెక్నిక్ కాలేజీల విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుత విధానంలోనే పాలిటెక్నిక్ కాలేజీలను కొనసాగించాలని కోరారు. కేంద్రం నిధులు వస్తాయనే పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి పాలసీలోకి తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేశామని, ఇష్టంలేకపోతే తొలగిస్తామని మంత్రి తమతో చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

