హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : ‘చేయూత’ దరఖాస్తుల ప్రక్రియలో పేదలను విస్మరించడంపై సీపీఎం రాష్ట్ర కమి టీ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుతం స్వీకరిస్తున్న కొత్త పింఛన్ల దరఖాస్తుల్లో వృద్ధులు, బీడీ కార్మికులతోపాటు హెచ్ఐవీ, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్సెల్ డిసీజ్, హీమోఫీలియా రోగులను విస్మరించడం విచారకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు.
మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం స్పందించి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రతి అర్హుడికీ సామాజిక భద్రత కల్పిస్తామని చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో వీరి దరఖాస్తులు స్వీకరించకపోవడంతో వారు రోడ్డునపడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.