జగిత్యాల, మార్చి 15 : పసుపు రైతులకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతుగా నిలిచారు. పసుపు పంట క్వింటాల్‌కు రూ.15 వేల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘జై జవాన్, జై కిసాన్’ అని రాసి ఉన్న ప్లకార్డులను శాసన మండలి ఆవరణలో పట్టుకుని గొంతెత్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదని, యాసంగి పంటలకు సాగునీరు లేక రైతులు మొత్తుకుంటున్నారని, అయినా రేవంత్ రెడ్డి సర్కార్‌కు చీమ కుట్టినట్టు లేదని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో పసుపు రైతుకు గిట్టుబాటు ధరలు రావడం లేదని, గిట్టుబాటు ధరల కోసం పసుపు రైతులు మెట్పల్లిలో రోడ్డెక్కారని గుర్తు చేశారు.