కొత్తపల్లి, జనవరి 8 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి(హెచ్)కి వచ్చారు. ముందుగా తూర్పువాడలోని శివాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో జరిగిన నాయకుడు పసుల చరణ్, మౌనిక దంపతుల కొడుకు నిష్ణాత్ ఫస్ట్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. బాలుడిని ఎత్తుకొని ముద్దుచేశారు. కవిత వెంట మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు జమీలొద్దీన్, జాడి శ్రీనివాస్, రుద్ర రాధ తదితరులు పాల్గొన్నారు.
Karimnagar1