మంథనిరూరల్/కథలాపూర్/ సిరిసిల్ల రూరల్, మార్చి 13: ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద నాయకులు కేకులు కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సబ్బని గంగు, నాయకులు వర్తినేని నాగేశ్వర్ రావు, కల్లెడ శంకర్, మైస శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న, మాజీ ఎంపిపి పడిగెల మానస, మాజీ ఏఎంసీ చైర్మన్ పూస పల్లి సరస్వతి, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, పడిగెల రాజు, మాట్ల మధు, వలకొండ వేణుగోపాల్ రావు, కందుకూరి రామా గౌడ్, కొయ్య డ రమేష్, అమర్ రావు, చిరంజీవి, తదితరులు ఉన్నారు.
తంగళ్లపల్లిలో ..
మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచస్థాయిలో చాటిన ఘనత కల్వకుంట్ల కవితక్కకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో భర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.