పెద్దపల్లి, డిసెంబర్24: యాసంగి పంటకు సాగు నీరు విడుదల చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నీటి సరఫ రాపై ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సత్యరాజ్ చంద్రతో సమీక్షించారు. గతంలో యాసంగి పంటకు ఎస్పారెస్పీ డీ -83, డీ -86 కాలువల ద్వారా వారబంధి పద్ధతి ద్వారా సాగు నీరు అందించామని, నేటి నుంచి సాగు నీటి సరఫరా చేస్తామని అధికారులు వివరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మాదిరిగా ఉన్న 8 రోజులు కాకుండా నేటి నుంచి మొదటి విడుత 12 రోజులు నీటిని సరఫరా చేయాలని కోరారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ నాయకులు గోపగాని సారయ్య గౌడ్, అంతటి అన్నయ్య గౌడ్, ఎండీ కలీం, ఎంపీ సజ్జు, ఆంజనేయ రావు, గుజ్జుల కుమార్ పాల్గొన్నారు.
పెద్దపల్లి టౌన్, డిసెంబర్ 24: నిరుపేద ముస్లింలకు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వితరణ చేసిన దుప్పట్లను ఆదివారం పట్టణంలోని మూన్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మానవ సేవయే-మాధవ సేవ’ నినాదం స్ఫూర్తితో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ నిరుపేదలకు అన్నదానం, నిత్యావసర సరుకుల వితరణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ సొసైటీ అధ్యక్షుడు మహామ్మద్ సయ్యద్, సభ్యులు అయాజ్, అయ్యాన్ అదిల్, జమీర్, కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్‌రావు, తాడురి పష్పకళ-శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
నిరుపేద ఆర్యవైశ్యులకు ఇండ్లు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు హామీ ఇచ్చారు. ఆదివారం ఆర్యవైశ్య భవన్లో ఎమ్మెల్యే విజయరమణారావును ఆర్యవైశ్యులు పూల మాలలు, శాలువాలతో ఆత్మీయ సన్మానాం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్స్ ఫీజుల తగ్గింపునకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇందులో మినుపాల ప్రకాశ్‌రావు, అంతటి అన్నయ్య గౌడ్, కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, పైడ పద్మ-రవి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోలూటి రమేశ్, పట్టణ అధ్యక్షుడు మంచాల వరప్రసాద్, సీనియర్ నాయకులు నార్ల నాగభూషణం, వెంటనారారయణ, కొరువెల్లి రాజేందర్, నగునూరి శ్రీకాంత్,పెద్ది వెంకటేశ్, కాసంగొట్టు వినయ్, కృష్ణమూర్తి, అపర్ణ,మంచాల జ్యోతి, కళావతి, స్రవంతి, పాల్గొన్నారు.