చొప్పదండి, జూన్ 10: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిలా మారిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేరొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు ఇస్తూ రైతుల పాలిట దేవుడు అయ్యాడని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు.
గ్రామ పంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దకుతుందన్నారు. చొప్పదండి పట్టణంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఆగస్టు 15వ తేదీ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కంటే ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగుల వేతనాలు తకువగా ఉన్నాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, చొప్పదండి మున్సిపాలిటీ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బర్త్‌డేలా ఈ సుపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కేక్ కట్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, సిబ్బంది, అధికారులను ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. అంతకు ముందు పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ర్యాలీ తీశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, కౌన్సిలర్లు కొట్టి అశోక్, మాడూరి శ్రీనివాస్, మహేశుని సంధ్య, చేపూరి హేమ, బిజిలి అనిత, వడ్లూరి గంగరాజు, రాజన్నల ప్రణీత, కొత్తూరి స్వతంత్ర భారతి, దండె జమున, పెరుమండ్ల మానస, జ్యోతి, కో-ఆప్షన్ మెంబర్లు అమరగొండ తిరుపతి, అజ్జు, సుల్తానా, మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్, తహసీల్దార్ రజిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు రామకృష్ణ, కొత్తూరి నరేశ్, పెరుమండ్ల గంగయ్య, చేపూరి సత్యనారాయణ, దండె కృష్ణ, మున్సిపల్, మెప్మా సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.