మంథని, నవంబర్ 11: మంథని గడ్డా.. గులాబీ పార్టీకి అడ్డ..ఇక్కడ గులాబీ జెండా ఎగురడం ఖాయం..రాష్ట్రంలో మళ్లీ మూడోసారి బీఆర్ఎస్దే అధికారం’ అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ధీ మా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు ఇదే విష యం తేల్చిచెబుతున్నాయని పేర్కొన్నారు. మంథని రాజగృహలో కాటారం సబ్ డివిజన్ కిసాన్ రైతు సేవా సంఘానికి చెందిన 100 మంది, కాటారం మండలం గారేపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కొండ వెంకటస్వామి, కొండ రాజేందర్, కొండ మహేశ్, గోగు స్వా మి, మంథని మండలం అకెపల్లికి చెందిన కాంగ్రెస్కు చెందిన మాజీ సర్పంచ్ మబ్బు ఓదెలు.
నాయకులు పెయ్యల తిరుపతి, అభి రాం, బుద్దార్థి వెంకటయ్య, పెయ్యల రాజు, మబ్బు నరేష్, సిద్ద రాకేశ్, పుట్టపాక గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కన్నూరి పుష్పలత-తిరుపతి, మహదేవపూర్ మండలం ఎన్కపల్లికి చెందిన 20 మంది కాంగ్రెస్ ్ట కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి పుట్ట మధూకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంథని నియోజకవర్గాన్ని సైతం తాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కార్యకర్తలు కష్టపడి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.