హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 23 : హుజూరాబాద్‌కు ఉద్యమాలు కొత్తేం కాదని, డంప్ యార్డు రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేసే వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు రద్దు కోసం ఆయన తన సతీమణి శాలినితో కలిసి గురువారం పోతిరెడ్డిపేట నుంచి హుజూరాబాద్ వరకు పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. పోతిరెడ్డిపేట పోచమ్మ దేవాలయంలో పూజలు చేసి, పాదయాత్రను ప్రారంభించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు కదిలివచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు. వెంకట్రావుపల్లి, సిర్సపల్లి గ్రామాల ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి మొదలు కొని ప్రజా పోరాటాలకు పురిటి గడ్డ హుజూరాబాద్ అని స్పష్టం చేశారు.
ధాన్య భాండాగారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని అందోళన వ్యక్తం చేశారు. డంప్‌యార్డు ఆలోచనలు మానుకోకపోతే ఆందోళలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, రమేశ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు వర్థినేని రవీందర్రావు, గందె శ్రీనివాస్, ప్రతాప మంజుల, నాయకులు తాళ్ళపల్లి శ్రీనివాస్, మొలుగు పూర్ణచందర్, కొయ్యడ శ్రీదేవి, అపరాజ ముత్యంరాజు, ప్రతాప తిరుమల్‌రెడ్డి, గఫార్, ఐలయ్య, వేముల గోవర్థన్, చెలుముల సత్యం, పంజాల సదానందం, కొలిపాక శ్రీనివాస్, అమ్జదుల్లాఖాన్, ఇమ్రాన్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.