కథలాపూర్, నవంబర్18: ‘ఉమ్మడి రాష్ట్రం లో వివక్షకు గురై, సాగుకు నోచుకోని బీడు భూ ములను స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు హ యాంలో సాగులోకి తెచ్చినం. కాళేశ్వరం ప్రాజె క్టు ద్వారా మండలాన్ని సస్యశ్యామలం చేసినం. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం అప్పుడెట్లుండె.. ఇప్పుడు ఎట్లయిందో.. ప్రజలు గమనించాలి’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పిలుపునిచ్చారు. గడపగడపకూ గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డితో కలి సి కథలాపూర్ మండలంలోని పోసానిపేట, కథలాపూర్, సిరికొండ, పెగ్గేర్ల, ఊట్పల్లి, భూషణ్రావుపేట, చింతకుంట, రాజారాంతండాలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా చల్మెడ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది.. ప్రత్యేక రాష్ట్రంలో గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. వరద కాలువ ద్వారా కథలాపూర్ మండలంలో 365 రోజులు నీళ్లు నిల్వ ఉండేలా చేసి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు కేవలం వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కాదు.. తెలంగాణ భవిష్యత్ ఎట్లా ఉండాలో నిర్ణయించేవన్నారు. ఆలోచించి ఓటేసి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్న తనకు ఒకసారి అవకాశం ఇస్తే.. గెలిచిన 9నెలల్లోపు సిరికొండ-తకళ్లపల్లి రోడ్డు నిర్మాణంతోపాటు అన్ని సమస్యలను పరిషరిస్తానని హామీ ఇచ్చారు.
అంతకుముందు ఆయా గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన చల్మెడకు స్థానిక మహిళలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. గొల్లకురుమలు గొర్రె పిల్లను బహూక రించి అభిమానాన్ని చాటుకున్నారు. పోసానిపేటలో పలువురు యువతులతో చల్మెడ ఆప్యాయంగా మాట్లాడి, ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను వివరించారు. కారు గుర్తు కు ఓటు వేసేలా గ్రామస్తులను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ నాగం భూమ య్య, ఎంపీపీ జవ్వాజి రేవతి-గణేశ్, వైస్‌ఎంపీపీ కిరణ్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు గడీల గంగప్రసాద్, ఏఎంసీ చైర్మన్ గుండారపు సౌజన్య-గంగాధర్, వైస్ చైర్మన్ సోమ దేవేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చుకా దేవరాజం, ఆర్బీఎస్ మం డల కన్వీనర్ కేతిరెడ్డి మహిపాల్‌రెడ్డి, రైతు సం ఘం అధ్యక్షుడు భూమారెడ్డి పాల్గొన్నారు.