కోనరావుపేట, నవంబర్ 10: ‘కాంగ్రెస్‌కు ఓటే సి కష్టాలను కొనితెచ్చుకోవద్దు.. ఆ పార్టీ అభ్యర్థుల బురిడీ మాటలు నమ్మితే.. నట్టేట మునిగినట్లే.. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పని చేస్తా’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు స్పష్టం చేశా రు. శుక్రవారం ఆయన కోనరావుపేట మండలం రామన్నపేట, కొలనూర్, నిజామాబాద్, మంగళ్లపల్లి గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరు ణ, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచా రం చేశారు. ఈ సందర్భగా చల్మెడ మాట్లాడుతూ, కాంగ్రెస్ అరవై ఏండ్ల పాలనలో కరెంట్ లేక అష్టకష్టాలు పడ్డామని, ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
అరవై ఏండ్ల పాలనలో కరెం ట్, రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి మరెన్నో పథకాలు కాంగ్రెసోళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి మొసలి కన్నీళ్లు కారుస్తూ, కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారిని నమ్మితే గోసపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని స్పష్టం చేశారు. అలనాటి కష్టాలు రాకుండా ఉం డాలంటే ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌నే సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రగతి కొనసాగాలి.. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కావాలం టే.. ప్రతిఒక్కరూ కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు.
మల్కపేట బిడ్డగా ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసేందుకు మీ సేవకుడిగా పని చేస్తానని స్పష్టం చేశారు. అంతకు ముందు గ్రామగ్రామాన మహిళలు, యువత మంగళహారతులతో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఘన స్వాగతం పలికారు. డీజే పాటలతో యువకులు నృత్యం చేస్తూ, జై చల్మెడ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో సెస్ వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య, పీఏసీఎస్ చైర్మన్ సంకినేని రామ్మోహన్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు మల్యాల దేవయ్య, యువజన విభాగం మండలాధ్యక్షుడు ముష్నం జీవన్‌గౌడ్, సర్పంచులు తుమ్మల యమున, కాదాసు సంతోష్, ఆగ్రహారం ఆలయ కమిటీ సభ్యుడు తాళ్లపల్లి సతీష్‌గౌడ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, నాగిరెడ్డి, నిరంజన్‌రావు, తిరుపతియాదవ్, రమణారెడ్డి, పవన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.