వేములవాడ, జూన్ 19: శాంతి భద్రతలను కాపాడుతూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ నిధులు రూ.10 లక్షలతో వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన 45 సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేయగా వాటిని ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన బుధవారం ప్రారంభించి మా ట్లాడారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు, నేరాలను అదుపు చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్ర జ లు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందం గా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
వేములవాడలో దేవాదాయ శాఖ సహకారంతో పట్ట ణ పరిధిలో 45 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. శాంతి భద్రతలు ఎకడైతే పటిష్టంగా ఉంటాయో అకడే అభివృద్ధి సాధ్యమని, ప్ర జల రక్షణ భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నారన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, ఆలయ ఈఈ రాజేశ్, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, కౌన్సిలర్లు, నాయకులున్నారు.