ప్రగతి ప్రదాత, మంత్రి కేటీఆర్ సభకు జనప్రవాహం పోటెత్తింది. ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించిన నవ నిర్మాణ సభకు ఇటు సింగరేణి కార్మికులు, అటు నియోజకవర్గ ప్రజానీకం ఉప్పెనలా తరలివచ్చింది. మధ్యాహ్నం మూడుగంటల వరకే మైదానం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోవడంతో రోడ్లపై బారులు తీరింది. అమాత్యుడు వేదికపైకి చేరుకోవడంతో ఒక్కసారిగా ‘జై కేసీఆర్.. జైజై కేటీఆర్’ అంటూ నినదించింది. యువనేత ఆద్యంతం తన ప్రసంగంతో ఉర్రూతలూగించడం, రామగుండం ఎమ్మెల్యే చందర్‌పై ప్రశంసలు గుప్పించడం, నియోజకవర్గంపై వరాలజల్లు కురిపించడంతో జేజేలు పలికింది. మొత్తంగా సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధుల్లో నూతన్సోతాహం వెల్లివిరిసింది.
– పెద్దపల్లి, మే 8 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని/ ఫర్టిలైజర్‌సిటీ
ప్రగతి ప్రదాత, మంత్రి కేటీఆర్ సభకు జనప్రవాహం పోటెత్తింది. ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించిన నవ నిర్మాణ సభకు ఇటు సింగరేణి కార్మికులు, అటు నియోజకవర్గ ప్రజానీకం ఉప్పెనలా తరలివచ్చింది. మధ్యాహ్నం మూడుగంటల వరకే మైదానం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోవడంతో రోడ్లపై బారులు తీరింది. అమాత్యుడు వేదికపైకి చేరుకోవడంతో ఒక్కసారిగా ‘జై కేసీఆర్.. జైజై కేటీఆర్’ అంటూ నినదించింది. యువనేత ఆద్యంతం తన ప్రసంగంతో ఉర్రూతలూగించడం, రామగుండం ఎమ్మెల్యే చందర్‌పై ప్రశంసలు గుప్పించడం, నియోజకవర్గంపై వరాలజల్లు కురిపించడంతో జేజేలు పలికింది. మొత్తంగా సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధుల్లో నూతన్సోతాహం వెల్లివిరిసింది.
– పెద్దపల్లి, మే 8 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని/ ఫర్టిలైజర్‌సిటీ
పెద్దపల్లి, మే 8 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని/ ఫర్టిలైజర్‌సిటీ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం నిర్వహించిన నవ నిర్మాణ సభకు జనం పోటెత్తారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన సభకు అరలక్షకుపైగా తరలివచ్చారు. నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రజలు, సింగరేణి కార్మికులు కదిలారు. అంచనాకు మించి జనం రావడంతో సభాస్థలి కిటకిటలాడింది. సాయంత్రం 4:30 గంటలకు మంత్రి కేటీఆర్ వస్తారని ప్రకటించగా, అప్పటికే కిక్కిరిసిపోయింది. సభా వేదికపైకి సరిగ్గా 5 గంటలకుచేరుకున్న కేటీఆర్, దాదాపు 36 నిమిషాల పాటు ప్రసంగించారు. నియోజకవర్గంలోని మహిళలు, సింగరేణి కార్మికులు మొత్తం 50వేల మందికిపైనే వచ్చారు. నిర్ణీత సమయాని కంటే అరగంట ఆలస్యంగా వచ్చినా, ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు.
ఉర్రూతలూగించిన ప్రసంగం
సభకువచ్చిన జనాలను చూసి సంతృప్తిని వ్యక్తం చేసిన కేటీఆర్, సభికులను తన ప్రసంగంతో ఉర్రూతలూగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందని, మీరంతా అండగా ఉండాలని పిలుపునివ్వడంతో ప్రతి ఒక్కరూ జేజేలు పలికారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే ఎకడి దాకనైనా వేటాడుతామని, విడిచిపెట్టేదేలేదని చెప్పడంతో ఒక్కసారిగా జైకేసీఆర్ అని నినదించారు. సింగరేణి కార్మికుల గురించి ప్రస్తావించారు. కేసీఆర్ కూడా సింగరేణి కార్మికులంటే ఎనలేని అభిమానం ఉన్నదని, సకల జనుల సమ్మెతో ఐదు రాష్ర్టాలకు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయేలా సమ్మెకు దిగి కేంద్రం కదిలేలా సింగరేణి కార్మికులు ఉద్యమించిన తీరును బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ మరువదని చెప్పడంతో కార్మికులు హర్షధ్వానాలు చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే రామగుండం అగ్నిగుండం అవుతుందని కేంద్రాన్ని హెచ్చరించడంతో నినాదాలతో హోరెత్తించారు. సింగరేణి మనుగడ సాధించాలంటే మన గోడు వినేటోడు ఒకడు ఢిల్లీలో ఉండాలని, ఈ బొగ్గు గనులను కాపాడుకోవాలంటే ఒక బీజేపీ అభ్యర్థికి కూడా ఓటేయొద్దని, డిపాజిట్లు గల్లంతు చేసి గుండు కొట్టించి అవతలికి పంపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే చందర్‌పై ప్రశంశల జల్లు..
ఎమ్మెల్యే చందర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఎమ్మెల్యే చందర్ తన వద్దకు ఎప్పుడు వచ్చినా రామగుండం డెవలప్మెంట్ గురించే వస్తడు. ప్రజలు ఆయన్ను కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. వారికి ఎంత చేసినా తక్కువేనని అంటుంటారు. ప్రజల కోసం ఈ పని కావాలి.. ఆ పని కావాలి అని కోరతాడు. సీఎం కేసీఆర్‌ను కలిసి మెడికల్ కాలేజీ కావాలని పట్టుబట్టి తెచ్చుకున్నడు’ అంటూ అభినందించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కోసం తపిస్తున్న ఎమ్మెల్యే చందర్‌ను ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్ర జరుగుతున్నదని, ఆయనను కడుపులో పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత రామగుండం ప్రజలపై ఉందన్నారు. సభ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో నయాజోష్ కనిపిస్తున్నది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత దూసుకెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
వరాలజల్లు
రామగుండం నియోజకవర్గంపై వరాలజల్లు కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రామగుండానికి మెడికల్ కాలేజీ వచ్చిందని, ఇండస్ట్రియల్, ఐటీ పారులను కూడా తీసుకువస్తామని, రెండు నెలల్లో తప్పకుండా శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి రామన్నకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు. గోదావరి దిశను మార్చి తెలంగాణ దశనను మార్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడ ఏడాది పొడవునా గోదావరిలో నిండుగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతోనే రామగుండం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని చెప్పారు.
‘ప్రగతి’ పైలాన్ ఆవిష్కరణ
కోల్‌సిటీ, మే 8 : రామగుండంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీనగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రగతి పైలాన్‌ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం 5.45 గంటలకు ఆవిష్కరించారు. కాగా, రూ.27లక్షల వ్యయంతో అత్యంత ఆకర్షణీయంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పైలాన్‌ను యుద్ధ ప్రాతిపాదికన నిర్మించారు. రామగుండం ఎన్టీపీసీ పరిధిలో రూ.3.80కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన మల వ్యర్థాల రీ సైక్లింగ్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)తోపాటు గోదావరిఖని 12వ డివిజన్ పరిధిలోని ఫైవింక్లయిన్ చౌరస్తాలో రూ.48లక్షలతో నిర్మించిన జంక్షన్, తదితర అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం రూ.112.65 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు. ఇక్కడ రాష్ట్ర సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్‌కుమార్, కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ,కమిషనర్ సుమన్‌రావు ఉన్నారు.