హ్యాపీ బర్త్‌డే రామన్న
మంత్రి కేటీఆర్ 48వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా, పట్టణ, మండల శాఖలు, ఆర్బీఎస్, విద్యార్థి విభాగం, కార్మిక విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి.
- ఘనంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు
- మొక్కలు నాటి.. సామాజిక సేవలో పాల్గొన్న అభిమానులు
- భారీ కేకులు కోసి, స్వీట్లు పంచిన బీఆర్ఎస్ శ్రేణులు
- ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా పలువురి చేయూత
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పలు చోట్ల మొక్కలు నాటి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా వితరణలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు. పలుచోట్ల రక్తదానాలు, అన్నదానాలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పేదలు, వృద్ధులకు పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భారీ కేకులు కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కాగా, కరీంనగర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని బర్త్‌డే కేకులు కట్ చేశారు.
– కరీంనగర్, జూలై 24(నమస్తే తెలంగాణ)

కరీంనగర్, జూలై 24(నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ 48వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా, పట్టణ, మండల శాఖలు, ఆర్బీఎస్, విద్యార్థి విభాగం, కార్మిక విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. డైనమిక్ లీడర్.. ప్రగతి ప్రదాత నూరేళ్లు వర్ధిల్లాలని ప్రజలంతా మనసారా దీవించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్‌లు కట్ చేసి స్వీట్లు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదానాలు, అన్నదానాలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వితరణ కార్యక్రమాలు చేపట్టి మానవత్వం చాటుకున్నారు.

- కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను మంత్రి గంగుల కమలాకర్ కట్ చేశారు. అనంతరం మొక్కలు, స్వీట్లు పంపిణీ చేశారు.
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వేల్పుల నవ్య పైలట్ శిక్షణకు ఎంపిక కాగా, ఆమె శిక్షణ కోసం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సోమవారం బూరుగుపల్లిలోని తన ఇంటిలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా రూ.50 వేలు అందజేశారు.
- కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు నగరంలోని 33వ డివిజన్లో నిరుపేదల ఇండ్లపై కప్పుకునేందుకు తన సొంత డబ్బులు రూ.5 లక్షలతో కొనుగోలు చేసిన 300లకు పైగా టార్పాలిన్ కవర్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.
- హుజూరాబాద్‌లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మొకలు నాటి, అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేశారు.
- వేములవాడ రాజన్న ఆలయంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోడె మొక్కు చెల్లించుకుని, ఆలయం ఎదుట భారీ కేక్ కట్ చేశారు.




Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

