సిరిసిల్ల/ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, మే 2 : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పర్యటించిన ఆయన, దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ, రైతులకు అభయమిస్తూ ముందుకుసాగా రు. ముందుగా మధ్యాహ్నం 12.20గంటలకు ముస్తాబాద్ చేరుకున్న మంత్రి, స్థానిక కొనుగోలు కేంద్రంలోని తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు పెంజర్లలక్ష్మి, గడ్డిరాములుతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ త ర్వాత చిప్పలపల్లికి చేరుకున్నారు. ఇటీవల జేఎల్ఆర్ ట్రస్టు అధ్యక్షుడు జూకంటి వెంకటేశ్వర్రావు మృతి చెందగా, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. మధ్యాహ్నం 1.10 గంటలకు గోపాల్పల్లిలోని అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కన్నీటి ప ర్యంతం కాగా, ఓదర్చారు.
రైతు దమ్మట రాజయ్యతో మాట్లాడారు. అక్కడే మహిళ రైతు ఎల్లవ్వ తనకు పుట్టుకతోనే ఒక కన్ను పోయిందని, పింఛ న్ ఇప్పించాలని వేడుకోగా, వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. అనంతరం 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరు వు తండాకు చేరుకొని, దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. 68మంది రైతులకు చెందిన 133 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయాన్ని అధికారు లు తన దృష్టికి తీసుకువచ్చారని, బాధితులందరికీ నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చా రు. 1.50 గంటలకు వీర్నపల్లికి చేరుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు చొప్పరి లక్ష్మితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గంగధారి కుమార్ పొలాన్ని పరిశీలించారు. 2.10 లకు సిరిసిల్లకు చేరుకున్నారు. ఎస్పీ అఖిల్‌మహాజన్ ఇంట్లో భోజనం చేశారు. 3 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వేదికగా రైతులకు భరోసానిచ్చారు. 3.30 గంటలకు రాజీవ్‌నగర్‌లోని మినీ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. సాయంత్రం 5.25 గంభీరావుపేట మండలంలోని గోరంటాలలో జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుంచి నర్మాలలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణంలో పాల్గొన్నారు. అక్కడే గంభీరావుపేట అర్బీఎస్ మండల కన్వీనర్ కముటం రాజేందర్ గృహ ప్రవేశానికి హాజరై హైదరాబాద్‌కు 6:50 గంటలకు తిరుగు పయనమయ్యారు.