పేదలకు అండగా ప్రభుత్వం
ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్ మంజుల అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ సహాయం కోసం మంత్రిని ఆశ్రయించగా..
- అనారోగ్యం పాలైన వారిని ఆదుకుంటున్నాం
- మంత్రి కొప్పుల ఈశ్వర్
- దోనూర్‌కు చెందిన మహిళ కుటుంబానికి రూ. 2.50 లక్షల ఎల్వోసీ అందజేత
ధర్మపురి, జూలై 26: ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్ మంజుల అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ సహాయం కోసం మంత్రిని ఆశ్రయించగా.. ఆయన స్పందించి ఆదుకున్నారు. నిమ్స్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్వోసీని మంజుల కుటుంబ సభ్యులకు మంగళవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స చేయించుకున్న పేదలకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య ఖర్చులు చెల్లిస్తున్నదన్నారు. అలాగే ముందుగా వైద్యశాల ఖర్చులు చెల్లించుకోలేని వారికి లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసీ)అందజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి వచ్చిన దరఖాస్తులను అధికారులు వెనువెంటనే పరిశీలించి లబ్ధిదారుల పేరున చెక్కులు సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి ఈశ్వర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

