కాంగ్రెస్ యాభై ఏండ్లు అధికారం వెలగబెట్టి ప్రజలను మోసం చేసింది. అభివృద్ధిని మరిచి అవినీతికి పెద్దపీట వేసింది. ఇప్పుడు గ్యారెంటీలంటూ మరోసారి దగా చేసేందుకు వచ్చింది. పొరపాటున నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే ఆగమవుతం. రాష్ట్రంలో కటిక చీకట్లు అలుముకుంటయి. మళ్లీ మోసపోతం.. గోసపడుతం. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను మూడోసారి సీఎంను చేసుకోవాలి.
ధర్మారం,నవంబర్ 11: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మితే అధోగతి పాలుకాకతప్పదని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను హెచ్చరించారు. 50 ఏండ్లు అధికారమిస్తే ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మళ్లీ ఒక్కచాన్స్ అంటూ ప్రజల ముందుకురావడం విడ్డూరమన్నారు. శనివారం శనివారం ధర్మారం మండలం మల్లాపూర్, నాయకంపల్లి, పత్తిపాక, నర్సింగాపూర్ గ్రామాల్లో ప్రజాఆశీర్వాదయాత్రలు నిర్వహించారు. ఆయాగ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒగ్గుడోలు నృత్యాలు, మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని మరిచి అవినీతికి పెద్దపీట వేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వెనుకబాటుకు ఆ పార్టీయే కారణమని ఆరోపించారు. నాడు దళితులకు తక్కువ సబ్సిడీతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేవారన్నారు. కానీ సీఎం కేసీఆర్ దళితకుటుంబాలకు దళితబంధు కింద రూ. 10 లక్షలు అందిస్తున్నారని గుర్తు చేశారు. వారి పాలనలో కేవలం రూ.200 పింఛన్ మాత్రమే ఉండేదన్నారు.
సీఎం కేసీఆర్ రూ. 2000 వేలకు పెంచారన్నారు. ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి గోస తీర్చారని, రైతాంగానికి నీటి తీరువా రద్దుతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం, మరణించిన రైతు కుటుంబానికి రైతు బీమా ద్వారా రూ.5 లక్షల సహాయాన్ని అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నా. నిరుపేద యువతుల వివాహాలకు కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ ద్వారా రూ.లక్ష 16 వేల సహాయం అందిస్తున్నారని చెప్పారు.
మూడోసారి అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు 5,016కు, రైతుబంధు సహాయాన్ని 16 వేలకు పెంపు, ఆరోగ్య రక్ష పథకం ద్వారా 15 లక్షల బీమా సౌకర్యం, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ. 3వేల గౌరవ భృతి అందించడం, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఉచితంగా సన్నబియ్యం, రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. ఇలాంటి తరుణంలో ప్రజలు పొరపాటున హస్తం గుర్తుకు ఓటేసి ఆగంకావద్దని హితబోధ చేశారు. ఈ క్రమంలో ధర్మపురిలో తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ద్వారా సహాయం అందుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎస్సీలు ఆగం కాకుండా దళితుల ఉన్నతి కోసం సహాయం అందించే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు.
ఇక్కడ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు బలరాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచులు గంధం వరలక్ష్మి, భూక్యా లావణ్య, బద్దం సుజాత, సురకంటి శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచులు మంద శ్రీనివాస్, నునావత్ శ్యామల రవి నాయక్, బండారి శ్రీనివాస్, కనుకుట్ల సంతోష్, ఏఎంసీ వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు పూస్కూరు రామారావు, ఎగ్గెల స్వామి, మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య,మండల కో ఆప్షన్ సభ్యుడు రఫి, విండో డైరెక్టర్లు నిమ్మ మల్లయ్య, సులోచన, బద్దం లింగారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గుండా సత్యనారాయణరెడ్డి, నేతలు బంగుటపు కొమురయ్య, బద్దం వెంకట్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్, భూక్య కొమురయ్య, నాయక్, మెన్నేని వెంకటేశ్వర్ రావు, బొజ్జ మహిపాల్, మెన్నేని నర్సింగారావు, గంధం రవీందర్, గంధం మల్లయ్య, బద్దం సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మూల సంజీవరెడ్డి,ఆవుల శ్రీనివాస్, గుర్రం తిరుపతి పాల్గొన్నారు.