ధర్మారం, ఏప్రిల్ 18: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125అడుగుల కాంస్య విగ్రహం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ఆర్టికల్-3 ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యం త ఎత్తయిన విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పా టు చేయించారని ఆయన అన్నారు. ఈ విగ్రహానికి హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్-2023 రికార్డులో చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈఘనత సీఎం కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. విగ్రహావిష్కరణలో భాగ స్వా మ్యం కావడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు. ఈ జ్ఞాపకం తనకు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, ఈ అవకాశం క ల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్లో ఏర్పాటు అంబేద్కర్ కాంస్య విగ్రహానికి హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్-2023 రికార్డులో చోటు దక్కడం, ఆ విగ్రహావిష్కరణ అనంతరం తొలిసారి మంగళవారం ధర్మారం మండలకేంద్రానికి వచ్చిన మంత్రికి నంది మేడారం ప్యాక్స్ చైర్మన్, జిల్లా ప్యాక్స్ చైర్మన్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ము త్యాల బలరాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు,కుల సంఘా ల నాయకులు ఘనస్వాగతం పలికారు. పాత బ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా దాకా పార్టీ నాయకులతో కలిసి మంత్రి కాలినడకన ర్యాలీగా వచ్చారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్రేన్ సాయంతో భారీ గజమాలను వేసి నమస్కరించారు. అనంతరం జరిగిన సమావేశానికి స్థానిక ఎంపీడీవో భీమ జయశీల వ్యాఖ్యాతగా వ్యవహరించి, కాంస్య విగ్రహ విశిష్టతను వివరించారు. ఈసందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. బీఆర్ అంబేద్కర్స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ఎస్సీల అభివృద్ధికోసం అనేక సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వారి ఆర్థికవికాసానికి ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశ పెట్టి 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేయడం, ఎస్సీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేయడంతోపాటు విదేశాల్లో చదివేందుకు 20 లక్షల సాయం అందించి ప్రోత్సహిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్కు వెన్నంటి ఉండి ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.