ఆలయాలకు పూర్వవైభవం
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆలయాలకు పూర్వవైభవం వస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
- స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
- వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం క్షేత్రాలకు నిధుల కేటాయింపు సంతోషకరం
- మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం/ ధర్మపురి, ఫిబ్రవరి18: స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆలయాలకు పూర్వవైభవం వస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. శివుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లిలోని సాంబమూర్తి, నందిమేడారంలోని అమరేశ్వరాలయాలను తన సతీమణి స్నేహలతతో కలిసి దర్శించుకున్నారు. తర్వాత జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని కోటేశ్వరస్వామి, ధర్మపురి శివారు అక్కపెల్లి రాజేశ్వరస్వామి, ధర్మపురి క్షేత్రం రామలింగేశ్వరస్వామి, నేరెళ్ల అటవీ ప్రాంతంలోని సాంబశివ, బుగ్గారంలోని సాంబశివ నాగేశ్వర, పెగడపల్లి స్వయంభూ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేశారు. కోటిలింగాలలో దర్శనం తర్వాత గోదావరిలో బోటింగ్ చేశారు. ఆలయాలకు చేరుకున్న అమాత్యుడికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
పూజల అనంతరం ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆయాచోట్ల మంత్రి ఈశ్వర్ మాట్లాడారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన యాదగిరిగుట్టను వం దల కోట్లు కేటాయించి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పా రు. ఇదే తరహాలో ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజ న్న, ధర్మపురి నర్సన్న, కొండగట్టు అంజన్న, కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి ఆలయాలకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించడం ఆనందంగా ఉన్నదన్నారు. ముఖ్యంగా కొండగట్టు ఆలయాభివృద్ధికి వెయ్యి కోట్లయి నా ఇచ్చేందుకు వెనుకాడబోనని ప్రకటించడం సంతోషకరమన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఎంతో భక్తి శ్రద్ధ్దలతో ప్రజలు శివుడికి పూ జలు చేస్తారని, వారికి శివుడి అనుగ్ర హం ఉం డాలని ఆకాంక్షించారు. ధర్మారంలో మంత్రి వెంట ధర్మారం జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొ ప్పరి చంద్రయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్రావు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

