కరీంనగర్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల అశ్వితకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన లక్షా 25 వేల రూపాయలు చెక్కును కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో లబ్దిదారుని కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరగా ఉంటుందన్నారు. ఆర్థికంగా వెనుకబడి వైద్యం చేయించుకోలేని వారికోసం సీఎం కేసీఆర్ పెద్ద మొత్తంలో సీఎం సహాయనిధిని అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చెవుల రవీందర్, కిష్టంపేట్ రామచందర్ రెడ్డి, కూన రాజేందర్ పాల్గొన్నారు.