కార్పొరేషన్, సెప్టెంబర్ 24: మళ్లీ అవకాశమిస్తే కరీంనగర్ అద్భుతంగా తీర్చిదిద్దుతా నని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటిం చారు. పార్టీలో చేరుతున్న యువతకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన మధు గార్డెన్స్ బీఆర్ఎస్ యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు హారీష్ ఆధ్వర్యంలో 300 మందికి పైగా యువకులు బీఆర్ చేరారు. వీరికి మంత్రి, మేయర్ వై సునీల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో కరీంనగర్ మురికికూపంగా ఉండేదన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాతే వందల కోట్లు తెచ్చి అభివృద్ధి చేశానని చెప్పారు. రోడ్లను అభివృద్ధి చేశానని, మానేర్ రివర్ కేబుల్ బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ప్రపంచమే కరీంనగర్ చూస్తుందని చెప్పారు. కేసీఆర్ పాలనవల్లే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు.
కరీంనగర్ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు. హస్తం, కమలం పార్టీలకు అవకాశం ఇస్తే ఢిల్లీ నుంచే పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణను గుడ్డి దీపంగా మారుస్తారని మండిపడ్డారు. ఇక్కడి యువత భవిష్యత్ అంధకారమవు తుందన్నారు. కాంగ్రెస్ 30 కేసులున్న రౌడీషీటర్లకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉన్నదన్నారు. అలాంటి వారికి అధికారమిస్తే ప్రభుత్వ, ప్రజల భూములను మాయం చేస్తారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ భద్రంగా ఉంటుందన్నారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ తాను కరీంనగర్ అభివృద్ది చేయాలన్న ఆలోచనతోనే పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు వెనకబడిన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ పాలనలో దేశానికి అన్నం పెట్టేస్థాయికి ఎదిగిందన్నారు. రానున్న రోజుల్లో వైద్యులను అత్యధికంగా అందించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధ్ది మరింత వేగంగా సాగాలంటే బీఆర్ మరోసారి గెలిపించాల్సినా అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ నేత అభినవ్, బీజేపీ నాయకుడు రాహుల్, యువ నేతలు దాసరి సాయి చరణ్, జక్కు అజయ్ ఆధ్వర్యంలో 300 మంది యువకులు బీఆర్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, ఐలేందర్, బీఆర్ నాయకులు తాటి ప్రభావతి, మహేశ్, శ్రీనివాస్, శ్యాంసుందర్, ప్రశాంత్ జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజు వెంకట్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కొనసాగాలంటే కారుకే ఓటేయ్యాలి
బీఆర్ పాలనలో, మంత్రి గంగుల, వినోద్ నేతృత్వంలో కరీంనగర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి తలమానికంగా నిలుస్తున్నవి. రోడ్లు, డ్రైనేజీలను అభివృద్ధి చేశాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజల వద్దకు వస్తున్నారు. వారిని ప్రజలు నమ్మవద్దు. ఆ పార్టీల ఉచ్చులో పడి మోసపోవద్దు. ప్రజల మధ్యన ఉండే బీఆర్ అభ్యర్థులను ఆదరించాలి. అప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యం.
– మేయర్ యాదగిరి సునీల్
బీఆర్ అభ్యర్థిని గెలిపించాలి..
ఉమ్మడి పాలనలో కరీంనగర్ మురికికూపంగా ఉండేది. రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండేవి. తొమ్మిదేండ్ల బీఆర్ పాలనలో మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాల్లో పురోగమిస్తున్నది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ఇదంతా ప్రజల ముందరే ఉన్నది. కానీ కొందరు అబద్ధాలు చెబుతూ యువతను రెచ్చగొడుతున్నారు. వారి మాయలో పడవద్దు. అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల మేలు కోసం కృషి చేస్తున్న బీఆర్ అభ్యర్థినే గెలిపించాలి.
– చల్ల హరిశంకర్, నగర బీఆర్ అధ్యక్షుడు